నవతెలంగాణ-ఆలేరు టౌన్
మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరి అన్నారు. హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ముందు మాట్లాడారు. అధికారంలోకి వస్తే 250 గజాల స్థలం, పింఛన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పిన కమిటీ బాధ్యులు ఎమ్మెల్సీ కోదండరాం ముందు గుర్తు చేశారు. ఉద్యమంలో ఆలేరు ముందుందని గుర్తు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం కోసం,ఆలేరు ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మాట వాస్తవం ,సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు ,ఆరోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



