- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినాన్ని వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూత్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



