Sunday, May 24, 2026
E-PAPER
Homeదర్వాజ"లతీఫ్ మియా బోల్!"

“లతీఫ్ మియా బోల్!”

- Advertisement -

విద్వేషానికి విరుగుడు : స్కైబాబ కథలు. ‘మరువం’ మాటల వేదిక, ‘లామకాన్’ (గోడలు లేని సాంస్కృతిక వేదిక) ల సంయుక్త సమర్పణలో ‘ధ్వని’నిండైన శ్రవ్య-రూప అనుభవం’ 4వ సంచిక ఈ నెల 28 సాయంత్రం 6.30 గంటలకు లామకాన్, GVK మాల్ ఎదురు సందులో, రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాద్ లో జరుగుతుంది.

‘సోషల్ పర్స్ పెక్టివ్స్’ పుస్తకావిష్కరణ సభ
డా. నీలం సంపత్ గారి ‘సోషల్ పర్స్ పెక్టివ్స్’ పుస్తకావిష్కరణ సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉంటుంది. ఆదివారం ఉదయం, మే 31న జరగబోయే ఈ సభలో ప్రొ. కోదండ రామ్, డా. కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్ రెడ్డి, అల్లం నారాయణలు, ఎ. పుల్లయ్య, డా.ఏనుగు నరసింహారెడ్డి, ప్రొ. కూరపాటి వెంకటనారాయణలు, సారంపల్లి మల్లారెడ్డి, ఎవివి ప్రసాద్, రాజేంద్రబాబు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఎం.వి. గోనారెడ్డి, డా.నర్రా ప్రవీణ్ రెడ్డి, కోట సతీష్ పాల్గొంటారు. తెలంగాణ తెలుగు పరిశోధక మండలి సభను నిర్వహిస్తుంది. – డా. నర్రా ప్రవీణ్ రెడ్డి, 8179179183

వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ -26 ఫలితాలు
వాసా ఫాండేషన్ – పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ – 2026 ఫలితాలు… 1. మొదటి బహుమతి – గజ్జెల రామకృష్ణ, 2. రెండో బహుమతి – పిన్నంశెట్టి శెట్టి కిషన్, 3. మూడో బహుమతి – ఈతకోట సుబ్బారావు. ప్రత్యేక బహుమతులు… 1. నాంపల్లి సుజాత, 2. కృష్ణవేణి పరాంకుశం, 3. గట్టు రాధిక, 4. దేవకి మహాసముద్రం, 5. దాకరపు బాబూరావు, 6. అవ్వారు శ్రీధర్ బాబు, 7. రహీమొద్దీన్, 8. లేదాళ్ళ రాజేశ్వరరావు. గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం 6 జూన్ 2026 సాయంత్రం 6 గంటలకు నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లో జరిగే వాసా ప్రభావతి జయంతి సభలో వుంటుంది

మల్లెతీగ పురస్కారం-26 కోసం కవితలు ఆహ్వానం
‘మల్లెతీగ పురస్కారం-2026’కు తెలుగు కవులందర్నీ కవితలు పంపమని ఆహ్వానిస్తున్నాం. కవితలు సామాజికాంశాల్ని స్పృశించేవిగా వుండాలి. కవితల్ని కొరియర్ లేదా రిజిస్టర్ పోస్టులో ఎడిటర్, నవమల్లెతీగ, 26 – 16 – 4 , టి – ఎఫ్ -1, శుభశ్రీ టవర్స్, ఉయ్యురు జమిందార్ స్ట్రీట్, గాంధీ నగర్, విజయవాడ – 520003 చిరునామాకు జూన్ 30 లోగా పంపాలి. ఈ మెయిల్ ద్వారా కవితల్ని పంపేవారు [email protected] కు పంపవచ్చు. వివరాలకు9246415150 నెంబరులో సంప్రదించవచ్చు. – కలిమిశ్రీ, అధ్యక్షులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ.

తెలుగు సాహితీవనం మహిళా ప్రతిభా పురస్కారం-2026 కు నవలలకు ఆహ్వానం
2023 నుండి 2025వ సం వరకు రచయిత్రులు ప్రచురించిన నవలలను 3 ప్రతులను జూన్ 15 లోపు ”బి సుమన జయంతి, D/O బి ఏ సైమన్, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర, ఎగువ గడ్డ, పెనుకొండ- 515110, శ్రీ సత్య సాయిజిల్లా, ఆంధ్ర ప్రదేశ్“ చిరునామాకు పంపాలి.
మొబైల్ :8919696972

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -