నిరుపేదలకు తాజా, మాజీ సర్పంచ్ బియ్యం పంపిణీ

Ramagiri– ఘనంగా వివాహ దినోత్సవ వేడుకలు 
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం రత్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు వివాహ దినోత్సవ వేడుకలను శనివారం  ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 15 మంది నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడే బియ్యం, నిత్యవసర సామాగ్రిని అందించారు. ప్రభుత్వ, అంగన్వాడి పాఠశాలలో విద్యార్థులకు అరటి పండ్లు అందించారు. సెంటినరీ కాలనీ స్టేడియంలో వాలీబాల్ క్రీడాకారులు సీనియర్ పాత్రికేయుడు పీవీరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పలువురు కేక్ లు  కట్ చేసి శాలువాలతో సత్కరించారు.అలగే రామగిరి పాత్రికేయులు చింతం కిరణ్, జేఆర్ ప్రవీణ్, ఏకు రవీంద్ర, పోలు మధు, సూత్రం శ్రీధర్, భరత్, చిలుక సురేష్, వెంకటేష్, సాయి తదితరులు  కేక్  కట్ చేసి సన్మానించారు.
Spread the love