– మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
బీఆర్ఎస్ పార్టీ గుర్తు పై గెలిచిన వారు పార్టీ మారాలనుకుంటే, ఆ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రగతి రిసార్ట్స్‌లో చేవెళ్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశంలో ఆమె పాల్గొన్ని, మాట్లాడుతూ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు, పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని అన్నారు. అదేవిధంగా వైస్ చైర్మెన్‌గా బీఆర్ఎస్ హాయంలో భానూరి వెంకట్రాంరెడ్డి కూడా కౌన్సిలర్ పదవికి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శ్వేతా పాండురంగారెడ్డి, పార్సి రాధా బాలకృష్ణ, లక్ష్మమ్మ రాంరెడ్డి, శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, సిహెచ్ అశోక్, గోపాల్, కో-ఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.