– ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మర్రి నిరంజన్‌రెడ్డితో సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయాలని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సూచించారు. టికెట్ రాకపోవడంతో అలకబూనిన మర్రి నిరంజన్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటూ జాతీయ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, ఇతర నా యకులు కలిసి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా బోసురాజు మాట్లాడుతూ.. ఇబ్ర హీంపట్నం నియోజకవర్గంలో మర్రి నిరంజన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరమన్నారు. నిర్వీర్య మంగా ప్రజాసేవలో, ప్రజాప్రతినిధిగా కొనసా గుతున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న నిరంజన్‌రెడ్డి సేవలను పార్టీ అధినాయకత్వం గుర్తించిందన్నారు. త్వరలోనే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరపున హామీ ఇస్తున్నట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. అభ్యర్థి గెలుపు బాధ్యతలను తీసుకుని పని చేయాలన్నారు. తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. ఆయన వెంట యాచారం మండల మాజీ వైస్ ఎంపీపీ దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మండల మాజీ అధ్యక్షులు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.