
అకారణంగా కొట్టిన పోలిసు వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని దమ్మ సాయికుమార్ తండ్రి లస్మయ్య శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం (ఈనెల 17) రాత్రి రుద్రూర్ బస్టాండ్ లో 11 గంటలకు హైదరాబాద్ నుంచి వస్తున్న సాయికిరణ్ బస్సు రాకకోసం అక్కడ వేచి ఉన్నాను అని, అదే సమయంలో హెూంగార్డు ఖరీం వచ్చి ఇంటికి వెళ్లాలని దుర్భాషలు అడాడు అని, బస్సు రాగానే వెళ్తానని చెప్పిన తర్వాత హోంగార్డు ఖరీం వెళ్లిపోయి, రుద్రూర్ ఏఎస్సై రాజు, కానిస్టేబుళ్లు చిన్నయ్య, రాజు, హోంగార్డు కరీం మళ్లీ పోలీసు వాహనంలో వచ్చి, కానిస్టేబుల్ చిన్నయ్య పోలీసు వాహనంలో నుంచి దిగుతూనే బైక్ పై ఉన్న నన్ను ఫైబర్ లాఠీతో వీపు, పిరుదులపై విచక్షణా రహితంగా కొట్టాడు అని బాధితుడు ఆరోపించాడు. అక్కడి నుంచి వెళ్తానని దండం పెట్టి చెప్పినప్పటికీ కొట్టడం ఆపలేదు అని, కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు వీపు, పిరుదులు కమిలిపోయయి అని, విపరీతంగా నొప్పి ఉండడంతో ఈనెల 18న ఉదయం 9 గంటలకు రుద్రూర్ ఎస్సై రవీందర్ ని కలిసి జరిగిన విషయాన్ని వివరించాను అని అన్నారు. దెబ్బలు చూపించాను అని, అకారణంగా కొట్టిన, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను అని అన్నారు. ఎస్సై వారితో మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి పంపివేశాడు అని, తర్వాత కొద్దిసమయానికి కానిస్టేబుల్ చిన్నయ్య వచ్చి హెూంగార్డు కరీం, ఏఎస్పై రాజు కొట్టమని చెప్పడంతోనే కొట్టడం జరిగిందని అన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేయవద్దని సారీ చెప్పి చిన్నయ్య వెళ్లాడు అని, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా ఇక్కడ సిబ్బంది ఎవరు లేరు అని ఫిర్యాదు తీసుకోలేరు అని అన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేయవద్దని, దవాఖానలో చూపిస్తామని, వారు డ్యూటీకి వస్తారు, వారి తో మాట్లాడుకోవాలని కోరారు. పోలీసు అధికారుల నంబర్లు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో 100 నంబరుకు ఫోన్ చేసి న్యాయం చేయాలని 6 సార్లు ఫోన్ చేయడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు ఈ విషయాన్ని తెలుపవద్దు అని గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్సై, సిబ్బంది వచ్చి, శుక్రవారం 10.30 గంటలకు కొట్టిన పోలీస్ వారితో మాట్లాడుదామని, కేసు పెట్టవద్దని ఒత్తిడి చేశారు అని అన్నారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్లో న్యాయం చేయకుండా పోలీసులు ఒత్తిడికి గురిచేస్తున్నారు అని ఆరోపించాడు. కొట్టిన, దుర్భాషలాడిన వారితో కలిసి ఫిర్యాదు తీసుకోకుండా రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు బాధితుడు వాపోయాడు.