సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను గెలిపించండి

– పార్టీ మండల కార్యదర్శి వర్గసభ్యులు బుగ్గరాములు
– ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలో ప్రచారం
నవతెలంగా-ఆదిభట్ల
అనునిత్యం ప్రజల కోసం పోరాడే సీపీఐ (ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్‌ పగడాల యాదయ్యను గెలిపించాలని ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గరాములు అన్నారు. సోమవారం ఆదిభట్ల మున్సిపాలిటీ గ్రామాలు కొంగరకలాన్‌, ఆదిభట్ల, బొంగళూర్‌, పటేల్‌గూ డ, మంగల్‌పల్లి గ్రామాల్లో ప్రచారం చేపట్టా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజల మధ్యకు రాని అభ్యర్థులను ఓడించాలన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు రావడం సిగ్గుచేటు అన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ పోరాటాలు నిర్వహించిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కిందన్నారు. ఇబ్రహీం పట్నం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఆదిభట్ల మున్సిపల్‌ నాయకులు కతాల్‌, పెంటయ్య, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి గణేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చరణ్‌, శ్రీకాంత్‌, కళాకారులు మ హేందర్‌, శారద, ధనేశ్వర్‌, శ్రీధర్‌, శీను, గణేష్‌, అశ్విని, సంతోష, శివాని, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love