- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలని డోంగ్లి మండల పరిధిలోని ఎనబొర గ్రామ సర్పంచ్ యూనుస్ పటేల్ అన్నారు. ఆదివారం ఆయన గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్రామ కారోబార్ గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



