Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

- Advertisement -

భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం
అడవులు అంతరించడంవల్లే గ్రామాల్లోకి కోతులు, వన్యమృగాలు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

నవతెలంగాణ- నల్లగొండ టౌన్‌
పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపుని చ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద ర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్‌ ట్రస్ట్‌ భవనంలో శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికి వేత, ప్లాస్టిక్‌ వినియోగం, నీటి వనరుల కాలుష్యం కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అనియంత్రిత వర్షాలు, నీటికొరత వంటి సమస్యలు ఏర్పడుతు న్నాయన్నారు. అడవులు భూమికి ఊపిరితిత్తు లాంటివి అని చెప్పారు. చెట్ల నరికివేత వల్ల వాతావరణ సమస్యలత దెబ్బతింటోందన్నారు. చెట్ల నరికివేత, అడవులు అంతరించడం వల్ల కోతులు, వన్యమృగాల స్థావరాలు దెబ్బతినడం, ఆహారం దొరక్క గ్రామాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి, పర్యావరణ పరిరోణకు ప్రజలంతా కృషి చేయాలని కోరారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.. ప్రకృతి వనరులను కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని రక్షించడం, భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమేనని వివరించారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని తెలిపారు. నీటిని వృథా కాకుండా వినియోగించాలని, పరి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, కాలుష్య నియం త్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, యువత పర్యావరణ పరిర క్షణలో ముందుండాలన్నారు. గ్రామాలు, పట్టణా ల్లో నిరంతర అవగాహనా కార్యక్రమాలు నిర్వ హించాలన్నారు. ప్రకృతిని కాపాడితేనే మానవ జీవనం సురక్షితంగా ఉంటుందని వక్తలు అభిప్రా యపడ్డారు. ఈ సదస్సులో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, జిల్లా సహాయ కార్యదర్శి దామెర లక్ష్మీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -