కామ్రేడ్ చేగువేరా ఆశయాలను కొనసాగిద్దాం: బూడిద గణేష్

నవతెలంగాణ – మల్హర్ రావు
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవకారుడు విప్లవ కెరటం కామ్రేడ్ చేగువేరా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ అర్జెంటీనా దేశంలో పుట్టిన చేగువేరా క్యూబా దేశానికి వెళ్లి అమెరికన్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా విరోచితమైన పోరాటం చేశారని అన్నారు వైద్య వృత్తి చేస్తే కేవలం రోగులను మాత్రమే నయం చేయగలమని దేశాలను పట్టిపీడిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని భూస్థాపితం చేయాలంటే ఎర్రజెండా ఎత్తుకోవడమే సరియైన మార్గమని భావించి వైద్య వృత్తిని పక్కనపెట్టి క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా యువకులు ఉద్యమకారులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ముత్యం శ్రీనివాస్ బోయిని శ్రీనివాస్ శంకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love