Saturday, June 7, 2025
E-PAPER
Homeమానవిఇలా చేద్దాం…

ఇలా చేద్దాం…

- Advertisement -

ఇంట్లో వస్తువులు వివిధ రకాల పాత్రలు ఎప్పటికప్పుడు కడిగి మురికి చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దీనికి మార్కెట్లో లభ్యమయ్యే సబ్బులు, పౌడర్లతోపాటు కొన్ని చిట్కాలు కూడా అవసరం.
– టీకప్పులు, చిన్న జాడీలు, సున్నితమైన గాజు, పింగాణీ వస్తువులను శుభ్రపరిచేప్పుడు సింకు అడుగున ఒక పాత బట్టని అమర్చుకోవడం మరవద్దు.
– క్రాకరీ ఇంటి అందాన్ని మరింత ఇనుపడిం పజేస్తాయనడంలో సందేహం లేదు. మరి అవి మరింత కాంతిని సంతరించుకోవాలంటే మామూలుగా కడిగిన వస్తువులను ఒకసారి ఉప్పు కలిపిన మంచినీటిలో ముంచి తీస్తే మరింత మెరుస్తాయి..
– దీపం కుందెలు, గ్లాసులు, ఇతర వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే వాటిని కడిగేటప్పుడు క్లీనింగ్‌ పౌడర్‌కు కాస్త సిట్రిక్‌ యాసిడ్‌ జతచేయాలి. చింతపండు ఉప్పు కూడా వేస్తే తెల్లగా వస్తాయి.
– గమ్‌తో అంటిచ్చిన స్టిక్కర్లు, తుప్పు మరకలు లాంటివి తొలగించడానికి కొన్ని కిరోసిన్‌ చుక్కలతో కాసేపు నానపెట్టి ఆ తరువాత శుభ్రపరచుకోవాలి.
– టీ కప్పు లోపల అడుగు భాగం, చెంచా, గరిటల వంపులు- పాత్రలను సులభంగా శుభ్రపరచలేని ఇలాంటి స్థలాల్లో మరకలు ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తగా మెలగడం అవసరం. అవి తొలగించ డానికి క్లీనింగ్‌ సోప్‌తోపాటు గోరువెచ్చని నీటిని వినియోగించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -