మనదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఉదయం కాస్త అలసటగా అనిపించినా, సాయంత్రం స్నేహితులతో ముచ్చటించాలన్నా ఒక కప్పు స్ట్రాంగ్ టీ ఉండాల్సిందే. అయితే, మీ ఇష్టమైన ఈ టీ పొడి అసలైనదేనా? లేక అందులో రసాయనాలు ఏమైనా కలిసి ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ లాభాల కోసం రసాయన రంగులు, వాడేసిన టీ పొడిని ఎండబెట్టి మళ్లీ రంగులు వేయడం, ఇనుప రజను కలపడం వంటి కల్తీలు జరుగుతున్నాయి. మరి వీటిని కనిపెట్టడం ఎలా?
చల్లని నీటితో పరీక్ష
ఇది సులభమైన పద్ధతి. ఒక గ్లాసు నిండా సాధారణ చల్లని నీటిని తీసుకోండి. అందులో ఒక చెంచా టీ పొడిని వేసి, కలపకుండా అలాగే ఉంచండి. ఒకవేళ టీ పొడి నీటిలో పడగానే వెంటనే ముదురు గోధుమ లేదా ఎరుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే, అందులో కృత్రిమ రంగులు కలిపారని అర్థం. అసలైన టీ పొడి చల్లని నీటిలో వెంటనే రంగును విడుదల చేయదు, కేవలం వేడి నీటిలోనే రంగు మారుతుంది.
టిష్యూ పేపర్ పరీక్ష: ఇందుకోసం ఒక శుభ్రమైన వైట్ ఫిల్టర్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌ను తీసుకోండి. దానిపై కొద్దిగా టీ పొడిని వేసి, కొన్ని చుక్కల నీళ్లు చల్లండి. కాసేపటి తర్వాత ఆ పేపర్‌ను నీటితో కడిగి, ఎండలో పెట్టి చూడండి. పేపర్‌పై ఎరుపు రంగు పడితే అది నకిలీదని అర్థం.
ఇలా చేద్దాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



