చాయ్ తాగుదామా భాయ్

నవతెలంగాణ-కొడంగల్‌
ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన మనసుకు, మొద్దు బారిన మెదళ్లకు చురుకుదనం తెచ్చేది చాయ్ …ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్‌లో కూర్చుని సరదాగా గంటల తరబడి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపేందుకు పని ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు తలనొప్పి నుంచి రిలీఫ్‌ పొందేందుకు, వ్యాపార విషయాలైన, రాజకీయ ముచ్చట్లయినా పిచ్చపాటి కబుర్లు అయిన ఏదైనా సరే అందరికీ అడ్డగా ఉండేది చాయ్ హౌటల్‌, ఒకటి పడితే ఉత్తేజం, ఉత్సాహం వచ్చేస్తాయి. అందుకే చారుకి అంతటి ప్రాధాన్యం ఉంది. కాలానుగుణంగా విభిన్న రకాల రుచులతో టీలు పట్టణాలలో అందుబాటులోకి వచ్చాయి. చాయ్ ప్రేమికుల నుంచి కూడా అంతే ఆదరణ ఉంది. అన్ని వయసులో వారు చాయ్ ని ఆస్వాదిస్తున్నారు.
ఎన్నో రకాలు
బాదం చాయ్, గ్రీన్‌, బ్లాక్‌, లెమన్‌, సొంటి-మిరియాలు ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. మారుతున్న వాతావరణకి తగ్గట్టుగా ప్రజలు చాయ్ ని ఎంపిక చేసుకుంటారు. మారుతున్న ప్రజల జీవనశైలికి అనుగుణంగా ఎన్నో రకాల టీ దుకాణాలు వేలుస్తుండడంతో చాయ్ రుచులను ఎంతో ఉత్సవంగా ఆస్వాదిస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో విభిన్న రకాల టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వీటి ప్రత్యేకత వాటిదే. రుచులు వేరైనా సిట్టింగ్‌ విషయంలో అందరూ కూర్చొని ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు సరదాగా మాట్లాడుకునేందుకు టీ స్టాల్స్‌లో సిట్టింగ్‌ మాత్రం అదుర్స్‌ అంటున్నారు చారు ప్రేమికులు.

Spread the love