ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకి అందిద్దాం..

నవతెలంగాణ – నిజంసాగర్

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కనీస కర్తవ్యమని బాన్సువాడ డివిజన్ వైద్యాధికారి శిరీష అన్నారు. గురువారం రోజు నులిపురుగుల దినోత్సవ సందర్భంగా ఆమె నిజం సాగర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే నే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుందని. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంది అని ఆమె అన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరిక మానసిక అభివృద్ధికి తోడ్పాటు కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతూ ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేస్తుందని ఆమె అన్నారు. ఆరోగ్య సమాజ ఏర్పాట్లు భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తుందని ఆమె అన్నారు. మండల వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని ఆమె అన్నారు. మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రలు అందించనున్నారని ఆమె తెలిపారు. అంతేకాక విద్యానభ్యసించిని వారికి ఆశా కార్యకర్తలు మాత్రలు అందించే విధంగా చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు.
నూలి పురుగుల వల్ల అనర్ధాలు 
నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్ధాలు కలుగుతాయి ముఖ్యంగా 1 నుండి 19 సంవత్సరాల వయసున్న వారిలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపులో నొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, వికారం, వాంతులు, మలంలో రక్తం, అతిసారం తో పాటు మరికొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని మండల వైద్యాధికారి రోహిత్ తెలిపారు.
నిర్మూలన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు 
పిల్లల్లో మూడు రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది అని మండల వైద్యాధికారి రోహిత్ తెలిపారు దానిలో ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు. వీటిని నిర్మూలించేందుకు అల్బెండజోలు మాత్రలు తీసుకోవాలి అని ఆయన తెలిపారు.. ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు గలవారు 200 ఎంజి మాత్ర, మిగతావారు 400ఎంజి మాత్రం వేసుకోవాలి అని ఆయన తెలిపారు. భోజనం తర్వాత మాత్ర వేసుకోవచ్చని మాత్రం వేసుకున్న ఒకరోజు లేదా రెండు రోజులు నులిపురుగులు ఉంటే మల  విసర్జన ద్వారా బయటకు వెళ్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి దేవి సింగ్, మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్, హెడ్ మాస్టర్ రామచందర్, సిబ్బంది సిద్ధిరామేశ్వర్, వెంకట్, నారాయణ, మధుసూదన్, సునీత పాఠశాల సిబ్బంది ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love