నవతెలంగాణ-ఆర్మూర్
డొంకేశ్వర్ మండల పరిధిలోని చిన్నయానం గ్రామానికి చెందిన బొమ్మ నరేష్ గత కొంతకాలండా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చులు భారీ మొత్తంగా అవసరమైందని బాదిత కుటుంబం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అనారోగ్య బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎల్‌ఓసీని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య బాధితులు, ఆపదలో ఉన్న వారెవరైనా బీజేపీ కుటుంబ సభ్యులను సంప్రదిస్తే వెంటనే స్పందించి, అండగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం బాదిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, బీజేపీ పార్టీకి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి, మారంపల్లి సంతోష్, వేముల భూమన్న బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



