– ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025
లక్నో: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు లైన్ క్లియర్ అయ్యింది. వెన్నునొప్పి గాయంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటకు దూరమైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 18 సీజన్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గ్రీన్ సిగల్ ఇచ్చింది. అయితే, మిచెల్ మార్ష్ ఐపీఎల్‌లో బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని, బౌలింగ్ చేయకూడదని సీఏ తెలిపింది. గాయంతో చాంపియన్స్ ట్రోఫీకి సైతం దూరంగా ఉన్న మిచెల్ మార్ష్ ఈ నెల 18న లక్నో సూపర్ జెయింట్స్ శిబిరంలో చేరనున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్ వరుసగా రెండో సీజన్‌లో జస్టిన్ లాంగర్ చీఫ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్ కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టనున్నాడు. ఇదిలా ఉండగా, గాయాలతో మార్ష్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోశ్ హాజిల్‌వుడ్‌లు సైతం ఈ వారంలో తమ ఐపీఎల్ జట్లతో చేరనున్నారు.