సాహితీ వార్తలు

అమృతలత – అపురూప అవార్డ్స్‌ – 2024
ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్‌లోని పి.ఎస్‌.తెలుగు యూనివర్సిటీ ఎన్‌.టి.ఆర్‌ ఆడిటోరియంలో ‘అమృతలత – అపురూప అవార్డ్స్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభలో అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు (డా||కె.వి.కృష్ణకుమారి, డా||ఆలూరి విజయలక్ష్మి), అపురూప అవార్డ్స్‌ (జి.యస్‌.లక్ష్మి, సిహెచ్‌.సుశీలమ్మ, శివలక్ష్మి, సావేరి దర్గాభవాని, ప్రొ||సమతా రోష్ని, నందూరి సుందరీ నాగమణిలకు) ప్రదానం వుంటుంది.
– నెల్లుట్ల రమాదేవి
అమ్మ చెక్కిన శిల్పం హిందీ అనువాదం ఆవిష్కరణ
జాలాది రత్న సుధీర్‌ రచించిన అమ్మ చెక్కిన శిల్పం పుస్తకం హిందీ అనువాదం – మా తుఝే నమన్‌ – ఆవిష్కరణ సభ ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు రవీంద్ర భారతిలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. ఈ సభకు సి.ఎస్‌. రాంబాబు, ఏనుగు నరసింహారెడ్డి, లక్ష్మణాచార్యులు, డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, డా. సురభి లక్ష్మీ శారద, గోవింద్‌ అక్షరు, దీపక్‌ చిండాలియా హాజరవుతారు.
– గుడిపాటి, పాలపిట్ట బుక్స్‌
జీవజలం చలం సాహిత్య సభ
ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు రవీంధ్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో చలం మ్యూజింగ్స్‌ – వస్తు రూపాలు అంశంపై చర్చ, చలం సాహిత్య స్మారకోపన్యాస సభ జరుగుతుంది. ఇందులో మామిడి హరికృష్ణ, సిహెచ్‌.ఉషారాణి, మెర్సీ మార్గరేట్‌, జ్వలిత, కొల్లాపురం విమల, కొండపల్లి నీహారిణి, ఐనంపూడి శ్రీలక్ష్మి, వాసరచెట్ల జయంతి, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు.
ఎమ్మెస్సార్‌ జాతీయ స్థాయి కథల పోటీ 2024
కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్‌ గారి స్మారకార్థం కథలను (నవ్యత, సృజన ముఖ్యం) ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన సాహితీవేత్తకు బహుమతి పొందిన కథలతో పాటు మరి కొన్ని ఉత్తమ కథలతో ‘కథా ప్రపంచం 2024’ పుస్తకం, సాహితీ పురస్కారం అందజేస్తారు. బహుమతులు వరుసగా రూ 5, 3, 2 వేల రూపాయలు. 5 పేజీల లోపు వున్న కథలను [email protected]   మెయిల్‌కు జూన్‌ 30 లోపు పంపాలి. వివరాలకు : యుగంధర్‌: 93947 82540
కవితల పోటీ ఫలితాలు
వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కర్కముత్తారెడ్డి స్మారక రెండు రాష్ట్రాల స్థాయి పాఠశాల విద్యార్థుల కవితల పోటీలో మహమ్మద్‌ రిమ్‌షా (8వ తరగతి, తడపాకల్‌), కుమ్మరి అనురాధ (పదవతరగతి, ఖైరతాబాద్‌), ఎన్‌ మౌనిక (7వతరగతి, దేవరకద్ర), చెరుకూరి కార్తీక్‌( 9వ తరగతి మంగళగిరి), వై మహతి (8వతరగతి, నిజమాబాద్‌).
– వి. సుమలత, కన్వీనర్‌

Spread the love