‘బిరుదురాజు శతజయంతి’ సమాలోచన
తెలుగుజాతి జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా స్పురసిద్ధులు.ఆయన శతజయంతి సందర్భంగా ‘ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి సదస్సు’ను తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఏప్రిల్ 16న ఖమ్మం ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో డా||నామోజు బాలాచారి, ఆచార్య బన్న అయిలయ్య, డా|| గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, డా||యాకూబ, డా|| బి.రాములు, కపిలభారతి, డా||మంధని శంకర్, డా||వాహెద్, డా||మహ్మద్ జాకీరుల్లా, డా||సీతారాం తదితరులు పాల్గొంటారు. సదస్సులో పరిశోధనా పత్రాల సమర్పణ, రామరాజు సాహిత్య సేవపై స్రసంగాలు వుంటాయి.
– డా||పి.రవికుమార్