అంతా ఢిల్లీలో మకాం..సర్వేలే కీలకం

Leaders leaning on the soil of Delhi... Piravis for the seat– అభ్యర్థుల ఎంపికలో కర్ణాటక ఫార్ములా,
– కొలిక్కి రాని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా, అభ్యర్థుల ప్రకటనపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ,
ఆశావహులకు టిక్కెట్లు దక్కేనా.
నవతెలంగాణ-సూర్యాపేట : శాసనసభ ఎన్నికల షెడ్యూలు ముంచుకొస్తున్నప్పటికి కాంగ్రెస్ లో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంలేదు. కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఆశిస్తున్నవారు ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తున్నారు.ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని అధినాయకులు చెప్పినప్పటికీ అది మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.ఇంకా అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం నెలకొంది.గత 2018 ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటన ను  జాప్యం చేస్తూ ఎన్నికలకు 15 రోజుల ముందు ప్రకటించి పార్టీ నష్ట పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా పట్టుమని రెండు నెలలు కూడా సమయం దొరకని పరిస్థితులో అధిష్టానం మాత్రం అభ్యర్థుల ప్రకటన పట్ల ఇంకా నాన్చుడు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో మాత్రం టికెట్ ఎవరికి దక్కుతుందో అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ప్రచారం చేయడంపై సందిగ్ధంలో పడుతున్నారు.బి.ఆర్.ఎస్.ను ఢీ కొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ టిక్కెట్ల వడపోత కె పరిమితమైంది.గత కొన్ని రోజుల నుండి టికెట్ల కేటాయింపులో కొలిక్కి రాకపోవడంతో  ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రధానంగా సూర్యాపేట స్థానం నుండి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అదేవిధంగా తుంగతుర్తి లో కాంగ్రెస్ పార్టీ నుండి అద్దంకి దయాకర్ ,వడ్డేపల్లి రవి, గుడిపాటి నరసయ్య, జ్ఞాన సుందర్,ప్రితం తదితరులు టికెట్ కోసం పోరాడుతున్నారు.ఇక్కడ టిక్కెట్ కోసం 23 మంది దరఖాస్తులు చేయడం గమనార్హం. ఇకపోతే హుజూర్నగర్ నుండి నల్గొండ యంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ స్తానం నుండి పద్మావతి లు   పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.ఈ క్రమంలో ఢిల్లీలోని వార్ రూమ్ లో అభ్యర్థుల వడ పోత ను సీడబ్ల్యూసీ చేపట్టింది. ఇందులో ప్రధానంగా ఏఐసీసీ నియోజకవర్గాల్లో నాలుగు సంస్థలతో రహస్యంగా సర్వేలను చేయించినట్లు సమాచారం. ఇదిగాక సునీల్ కనుగోలు సర్వే ను కూడా పరిగణనలోకి తీసుకొని ఐదు సర్వేల్లో ప్రజలు అధికంగా ఎవ్వరి పేరును సూచిస్తారో అతనికే టిక్కెట్ కేటాయించాలనే యోచనలో సీడబ్ల్యూసీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల్లో తారాజువ్వల్లా దూసుకుపోయే రేసుగుర్రాలను ఎంపిక చేసేందుకు సర్వేలనే పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా అభ్యర్థుల ఎంపిక కమిటీ లో ఉన్న సభ్యులు సూచిస్తున్న పేర్లు సర్వే రీపోర్టు లో ఉన్న పెరు కు “ట్యాలి” అయితే మాత్రం వెంటనే ఆ పేరును ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ సర్వే కు వ్యతిరేకంగా మరో పేరును ప్రతిపాదిస్తే మాత్రం ఆ పేరును పెండింగ్ లో పెడుతున్నట్లు సమాచారం.కమిటీ లో ముఖ్యులు మాత్రం కర్ణాటక ఎన్నికల్లో ఏవిధంగా అభ్యర్థులను ఎంపిక చేశారో ఆ “ఫార్ములా” నే ప్రయోగిస్తున్నట్లు  టిక్కెట్ ఆశిస్తున్నా నాయకుడొకరు డిల్లీ నుండి నవ తెలంగాణ ప్రతినిధి తో పేర్కొన్నారు. అదేవిధంగా వడపోత లో ఎలాoటి ఫైరవిలు నడవడం లేదని కేవలం సర్వేల మీదా ఆధారపడి సీడబ్ల్యూసీ కసరత్తులు చేస్తుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారిందని తెలుస్తోంది. కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు మాత్రం తమకు అనుకూలంగా ఉన్న వారి కోసం టిక్కెట్ల కేటాయింపు పట్ల పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తన వర్గ్యుల కోసం తగ్గడం లేదని దీంతో వార్ రూమ్ లో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదని సమాచారం.వీరి వాగ్వాదం నేపథ్యంలో మిగతా కమిటీ సభ్యులు సర్వే ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేద్దామంటూ ఎంపిక ను పెండింగ్ లో పెడుతున్నట్లు చర్చ నడుస్తోంది. కాగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలోనే ఉండగా తాజాగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కూడా డిల్లి కి వెళ్ళారు. ఇరువురు కూడా ఢిల్లీలోనే ఉండి టిక్కెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా తుంగతుర్తి నుండి టిక్కెట్ ఆశిస్తున్నా వారిలో కూడ కొందరు ఢిల్లీ లొనే మకాం వేశారు. జిల్లాలోని ఆశావహులంతా ఢిల్లీకి చేరడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆశావహులు టిక్కెట్ల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అభ్యర్థుల పేర్లు ఫైనల్ కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణి తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారు.కాగా ఈ నెల చివర్లో లేక అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానున్న మొదటి జాబితాలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పేర్లు ఉంటాయా లేదానేది వేచి చూడాలి.
Spread the love