లోక్‌సభ సోమవారానికి వాయిదా…

నవతెలంగాణ – ఢిల్లీ: విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అందుకు స్పీకర్ ఓంబిర్లా అనుమతించలేదు. విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Spread the love