ఎన్నాళ్లీ ఎదురుచూపులు.?

– ప్రజాపాలన సైట్ లో టెక్నీకల్ సమస్యలు
– మండల కార్యాలయం చుట్టు ప్రజల చక్కర్లు
– గ్యాస్ సబ్సిడీ, కరెంట్ జీరో బిల్లులు రాక ఇబ్బందులు
– ప్రభుత్వం స్పందించాలని దరఖాస్తు దారుల వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం ద్వారా లబ్ది పొందాలనుకునే వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. గ్యాస్ సబ్సిడీ, జీరో విద్యుత్ బిల్లుల కోసం దరఖాస్తులు అందజేసినప్పటికి చాలామందికి సాంకేతిక సమస్యలు, దరఖాస్తుల్లో తప్పిదాల కారణంగా పథకాలు వర్తించడం లేదు. దీంతో మండల పరిషత్ కార్యాలయం చుట్టు ప్రజలు చక్కర్లు కొడుతున్నారు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ప్రజాపాలన సైట్ తిరిగి ప్రారభం కాగా, సాంకేతిక కారణాలతో సైట్ మండల కేంద్రంలో తెరుచుకోవడం లేదనే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. తెరుచుకున్న ఎడిట్ అప్సన్, ఇతర టెక్నీకల్ సమస్యలు ఎదురవుతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
దరఖాస్తులు ఇలా..
గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు 15 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. మండల వ్యాప్తంగా 7,433 నివాసాలు ఉండగా, జనాభా 25,343 ఉంది. ఒక్కొక్క ప్రజాపాలన దరఖాస్తులో ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అందులో నుంచి ఒక్కొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్రోడీకరించి ఏయే పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో విభజించారు. మండల వ్యాప్తంగా అభయహస్తం పథకానికి మొత్తం 9,357 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
అయోమయంలో లబ్ధిదారులు..
గ్రామాల్లో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ప్రయివేటు ఆపరేటర్ల సహకారంతో ఆన్ లైన్లో నమోదు చేశారు. ఇందులో చాలామందికి సరైన అనుభవం లేకపోవడంతో దరఖాస్తు దారుల పేర్లు, మీటర్ యుపిఎస్, ఆధార్, తెల రేషన్, గ్యాస్ కనెక్షన్ల నెంబర్లు తప్పుగా నమోదు చేయడం ఈ దరఖాస్తులు నేరుగా అధికారుల చేతుల్లోనే వెళ్లడంతో వారుకుడా తప్పిదాలు సరిచేయకుండానే ఒకే చేయడంతో చాలామంది అర్హులైన వారు కూడా గ్రుహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ పథకాలకు దూరమైయ్యారు. మండలంలో మొత్తం 5,512 మీటర్లు ఉండగా ఇందులో 3,649 మంది జీరో బిల్లుకు ఎంపిక కాగా మిగతా 1,863 మంది పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాగే మండలంలో 8,341 కనెక్షన్లు ఉండగా ఇందులో సగానికి పైగానే ప్రభుత్వం అంధించే రూ.500 సబ్సిడీ వర్తించనట్లుగా తెలుస్తోంది.
Spread the love