Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆటలుఐర్లాండ్‌ కెప్టెన్‌గా లోర్కాన్‌ టక్కర్‌

ఐర్లాండ్‌ కెప్టెన్‌గా లోర్కాన్‌ టక్కర్‌

- Advertisement -

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్‌ జట్టు ఎంపిక
డబ్లిన్‌ :
ఐర్లాండ్‌ టీ20 జట్టుకు కెప్టెన్‌గా లోర్కాన్‌ టక్కర్‌ ఎంపికయ్యాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ పాల్‌ స్టిర్లింగ్‌ నాయకత్వ పగ్గాలను వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు లోర్కాన్‌ టక్కర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ ఐర్లాండ్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు సీమ్‌ బౌలర్లు జోశ్‌ లిటిల్‌, మార్క్‌ ఎడెర్‌, కర్టీస్‌ కాంపెర్‌, బారీ మెక్‌కార్తీ, జోర్డాన్‌ నీల్‌లకు గాయాలు కావటంతో భారత్‌తో సిరీస్‌కు ఐదుగురు సీమ్‌ బౌలర్లను ఎంపిక చేసే వనరులు సెలక్షన్‌ కమిటీకి అందుబాటులో లేకుండా పోయింది. భారత్‌, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌ జూన్‌ 26 నుంచి ఆరంభం కానుంది. 26న తొలి టీ20 జరుగనుండగా, 28న రెండో టీ20 షెడ్యూల్‌ చేశారు. అక్కడ్నుంచి భారత జట్టు నేరుగా ఇంగ్లాండ్‌కు చేరుకోనుంది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్‌ జట్టు :
రాస్‌ ఎడెర్‌, బెన్‌ కాలిట్జ్‌, గారెత్‌ డెలానె, జార్జ్‌ డాక్‌రెల్‌, స్టీఫెన్‌ డొహెనె, మాథ్యూ హంప్రేస్‌ గావిన్‌ హోయె, మాట్‌ హోలార్డ్‌, లియాం మెక్‌కార్టీ, జై మూండ్ర, హ్యీరీ టెక్టర్‌, టిమ్‌ టెక్టర్‌, లోర్కాన్‌ టక్కర్‌ (కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), రూబెన్‌ విల్సన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -