మద్దికుంట ఆలయంలో మాఘమా స్నానాలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మద్దికుంట లో వెలిసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కోనేటిలో మాఘము స్నానాలు ఆచరించి, ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసింది. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాగమా అమావాస్య పురస్కరించుకొని గతంలో ఆర్టీసీ మూడు బస్సులను నడిపేది, ఈ సంవత్సరం ఓకే బస్సును నడపడంతో భక్తులు, సందర్శకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించటం, కాలినడకతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని సందర్శకులు కోరారు. స్థానిక జెడ్ పి టి సి నా రెడ్డి మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాతలుగా బసవపురం గీతా రాణి- సంతోష్ గౌడ్, బొమ్మిడి నవ్య- సంతోష్ రెడ్డి, వడ్ల యమునా- బ్రహ్మచారి, జూపల్లి లతాశ్రీ- తిరుపతి రెడ్డిలు నిర్వహించారు.  ఆలయ కమిటీ, ఆలయ పూజారులు, అన్నదాతలను శాలువాతో సన్మానించి, స్వామి వారి జ్ఞాపకం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోజారి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love