ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి

నవతెలంగాణ –  కంటేశ్వర్
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్ నందు గాంధీ చిత్రపటానికి అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులు మంగళవారం అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాని స్వాతంత్రం రావడంలో గాని మహాత్మా గాంధీ పాత్ర కీలకమైందని, స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను, వస్తువులోనూ వాడాలని సూచించిన వ్యక్తి అని, కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు జీవనం సాగించాలని, ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని భావించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పాలకులు నెహ్రూ గాంధీల సేవలను ప్రజలకు తెలియకుండా చూడాలని చూస్తున్నారని ,కానీ ఆకాశం పై ఉమ్మి వేస్తే అది వారి మీద పడుతుందని వారు గుర్తుంచుకోవాలని ,ఎప్పటికీ మరువలేనివని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి కార్యదర్శి రాంభూపాల్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, ఎన్ ఎస్ యు ఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్,మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, ఉష, విజయలక్ష్మి,మాజీ కార్పొరేటర్ రఘు,ధర్మ గౌడ్,స్వామి గౌడ్,నర్సింగ్ రావు, శోబాన్,ప్రమోద్,మహేందర్,సర్దార్ సింగ్,బులక్ష్మి  తదితరులు పాల్గోన్నారు.
Spread the love