ఆర్ టీ ఐ సమావేశాన్ని విజయవంతం చేయండి

నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 13 న సమాచార హక్కు వికాస సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనము లో ఉదయం 10-30 నుండి రెండు గంటల వరకు జరుగు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ను విజయవంతం చేయాలని సమాచార హక్కు చట్టం వ్యవస్తాపక అధ్యక్షులు డాక్టర్ యారమాద కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండలాల కమిటీల సభ్యులు, ఆయాక మిటీల బాధ్యులు, ప్రతి సభ్యుడు సమయానికి హాజరుకావలెనని తెలిపారు. అదేవిదంగా సమాచార హక్కు వికాస సమితిలో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావలెనని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు,నల్లగొండ జిల్లా ఆర్టిఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్ వీ హెచ్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంఛార్జి కుర్శీద్, జిల్లా అధ్యక్షులు సురేష్ జిల్లా ప్రదాన కార్య దర్శి బాల స్వామీ, జిల్లా కమిటీ ముఖ్యులు హాజరవుతున్నారని తెలిపారు. కావున ప్రతి సభ్యులు తప్పని సరిగ్గా సభ్యులు సమయానికి హాజరు కావాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అన్ని నియోజక వర్గాల పరిధిలో వున్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పని సరిగ్గా రావాలని హాజరు కానిచో వారి సభ్యత్వం రద్దు చేయబడునని తెలిపారు.

Spread the love