టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత సమావేశాలను విజయవంతం చేయండి

నవతెలంగాణ – హలియా
– జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం
 ఆదివారం నాడు శాలిగౌరారం లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత సమావేశాలను భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని పెరుమాళ్ళ వెంకటేశం అన్నారు.  హాలియాలో ఈ సమావేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఇటీవల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వారి మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, అర్ధాంతరంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ,పెండింగ్లో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేయాలని, కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే వర్తింపజేయాలని, పాఠశాలలకు స్కావెంజర్లు స్వీపర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు రాచమల్ల రమాదేవి ,వడ్త్య రాజు, టీఎస్ యూటీఎఫ్ అనుముల మండల అధ్యక్షులు మన్నెం వెంకటేశ్వర్లు ,ప్రధాన కార్యదర్శి చింతపల్లి రవీందర్, జిహెచ్ఎం కృష్ణమూర్తి, సీనియర్ యుటిఎఫ్ నాయకులు కొడుమూరి వెంకట్రాంరెడ్డి ,బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల ప్రసాద్, వీరా సింగ్, ప్రశాంత్ కుమార్ ,రామకృష్ణారెడ్డి, చంద్రయ్య ,అంజయ్య, షరీఫ్, రాజా, నాగేశ్వర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love