Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆటలుమార్ష్ మెరుపులు

మార్ష్ మెరుపులు

- Advertisement -

లక్నో సూపర్ జెయింట్స్ 220/5
జైపూర్ : ప్లే-ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు విఫలమయ్యారు.సవాయ్ మాన్ సింగ్స్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు నిర్ణీత20ఓవర్లలో5వికెట్లు కోల్పోయి 220పరుగులు చేసింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్(96; 57 బంతుల్లో11ఫోర్లు, 5 సిక్స్‌లు)తృటిలో సెంచరీని మిస్ చేసుకోగా..జోస్ ఇంగ్లిస్(60; 29 బంతుల్లో7ఫోర్లు, 3 సిక్స్‌లు)విధ్వంసం సృష్టించారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 50బంతుల్లో109పరుగులు జోడించారు. ఈ జోడీని రాజస్తాన్ బౌలర్ యశ్ రాజ్ పుంజా విడదీశాడు.ఆ తర్వాత నికోలస్ పూరన్(16)విఫలమైనా.. కెప్టెన్ పంత్(35)ధనా ధన్ ఇన్నింగ్స్ తో మెరిసాడు.ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(35; 23 బంతుల్లో2ఫోర్లు, 2 సిక్స్‌లు),మిచెల్ మార్ష్(96)వెనువెంటనే రనౌట్ అయ్యారు.మార్ష్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.నికోలస్ పూరన్ కి తోడు ఆయుశ్ బదోని(0)నిరాశపర్చాడు.దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లక్నో జట్టు 220పరుగుల భారీస్కోర్ చేసింది.రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజు పుంజాకు రెండు,జోఫ్రా ఆర్చర్ కు ఒక వికెట్ దక్కాయి.

స్కోర్ బోర్డ్
లక్నో సూపర్ జెయింట్స్
: మిచెల్ మార్ష్ (రనౌట్)జైస్వాల్96,ఇంగ్లిస్(బి)యశ్ రాజ్ పుంజ 60,పూరన్(సి)ఫెర్రీరా16,పంత్(రనౌట్)ధృవ్ జురెల్/ఆర్చర్35,అబ్దుల్ సమద్ (నాటౌట్) 0, ఆయుష్ బడోనీ (బి)జోఫ్రా ఆర్చర్ 0,అదనం13. (20 ఓవర్లలో5వికెట్ల నష్టానికి) 220 పరుగులు.a
వికెట్ల పతనం: 1/109, 2/151, 3/215, 4/220, /220
బౌలింగ్: ఆర్చర్4-0-39-1,సుశాంత్ మిశ్రా 4-0-46-0,సందీప్ శర్మ 3-0-43-0,బ్రిబేజ్ శర్మ 4-0-44-0,యశ్ రాజ్ పుంజా 4-0-35-2,శనక1-0-10-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -