- ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-మిరుదొడ్డి: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు జెండా ఎగరవేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, “దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. 8 గంటల పనిదినం కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజును స్మరించుకుంటున్నాం” అని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



