Friday, May 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్హక్కుల రక్షణకు పోరాడాలి: సీపీఎం

హక్కుల రక్షణకు పోరాడాలి: సీపీఎం

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోవాలని సీపీ ఐ ఎం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకొని పాటు పలు గ్రామాల్లో హమాలీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా మండలవ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అలాగే మార్కెట్ కమిటీ, బస్టాండ్ ఆవరణల్లో సీపీఎం, సీఐటీయూ నాయకులు జెండాలను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో కార్మికులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం సీనియర్ నాయకులు కూకటికారి బుచ్చయ్య, సీఐటీయూ, మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్, గిరిజన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఎస్.కె అబ్దుల్లా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్, కూసవేర్ల రాజన్న జయ చందకృష్ణ,
వ్యకాస నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -