
మండలంలోని కోస్లీ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అలీ సాగర్ గుప్త లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్(సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం మేడే సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గణేష్ కార్మికుల పండగ మే డే స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకుంటామని అన్నారు. కనీస వేతనం నిర్దిష్ట పని సమయంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కార్తీక్, సందీప్, పవన్, భూమన్న, నగేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.