ఫాం ఆయిల్ రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ఆశయం: ఎండీ అశోక్ రెడ్డి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యాన రైతుల ఆదాయం రెండింతలు కాదు మూడింతలు రెట్టింపు లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్  ఎండీ, ఉద్యాన శాఖ డైరెక్టర్ కే. ఆశోక్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు ప్రాజెక్టు విజయవంతంగా సాగుతుందని చెప్పారు.
ఆయిల్ ఫెడ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా అశ్వారావుపేట వచ్చిన ఆయన నియోజక వర్గంలోని దమ్మపేట,అశ్వారావుపేట మండలాల్లో గల సంస్థ పరిశ్రమలను,ఆయిల్ ఫాం క్షేత్రాలను విస్తృతంగా పర్యటించారు. మంగళవారం ఉదయమే డివిజనల్ కార్యాలయం, కేంద్రీయ ఆయిల్ ఫాం నర్సరీలను పరిశీలించిన ఆయన ముందుగా డివిజనల్ కార్యాలయంలో పరిపాలనా పరం అయిన అంశాలను, సంస్థ వ్యవహారాలను శాప్ లో నమోదు చేసే ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షేత్ర స్థాయీ సిబ్బంది పనితనం ను ఆరా తీసారు.
అనంతరం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయిల్ ఫాం రైతుల అభివృద్ధి,సంక్షేమం, అనుబంధ రంగాల పురోగతికి అధిక ప్రాధాన్యత నివ్వనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల రైతులతో పాటు ఉద్యోగులు ఎక్కువ ఆశక్తి చూపుతున్నారని, అందుకే వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. పెరుగుతున్న సాగు విస్తరణకు అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేకనే రైతు కుటుంబాలు పట్టణాలకు వలస వెళుతున్నారని,దీనిని దృష్టిలో పెట్టుకుని పల్లెల్లోనూ ఉద్యాన సాగుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచటానికి దృష్టి సాధిస్తున్నాం అని చెప్పారు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా ఇతర జిల్లాల్లో ఆయిల్ ఫాం సాగుపై రైతులకు కనీస అవగాహన లేక విస్తరణ లక్ష్యం మందకొడిగా సాగుతుందని, అయితే ఫాం  ఆయిల్ సాగు, ప్రభుత్వ రాయితీలు, దీర్ఘకాలిక నికర ఆదాయం వంటి అంశాలను ఆయిల్ ఫెడ్ పరిధిలోని జిల్లాల్లో రైతులకు వివరించి విస్తరణ లక్ష్యాన్ని అధిగమించ గలం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఉద్యాన శాఖలో 90 పోస్టులను భర్తీ చేయనున్నామని,దీని ద్వారా ఉద్యోగుల కొరత కూడా తీరుతుందని
క్షేత్ర స్థాయి పరిశీలన:
మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎండీ అశోక్ రెడ్డి పామాయిల్ మొక్కల పెంపకం, ఫ్యాక్టరీ లో గెలలు క్రస్సింగ్, ఆయిల్ రివకరి,ఉప ఉత్పత్తులు,కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. ముందుగా నారంవారిగూడెం లోని ఆయిల్ఫెడ్ నర్సరీలో మొక్కల పెంపకం,నిర్వహణ,పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి ఫ్యాక్టరీకి చేరుకున్నారు. కొత్త ఫ్యాక్టరీ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ప్యాక్టరి లో గెలలు క్రసింగ్, ఆయిల్ రికవరీ,క్రూడాయిల్ నిల్వ, క్రిసింగ్ ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులు,రైతులను ఎలా ఉపయోగ పడుతున్నాయో ఆరా తీశారు.అక్కడ నుండి అశ్వారావుపేట మండలం, గంగారం లోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు చెందిన పామాయిల్ తోటను సందర్శించారు. అంతర పంటగా సాగులో ఉన్న కోకో,దమ్మపేట మండలం అల్లి పల్లి లో వక్క సాగును పరిశీలించారు.వారి దిగుబడులు,రైతుల ఆదాయంపై వివరాలు సేకరించారు. ఉద్యాన రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అదికారులు అంతా సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి,పీ అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజనల్ ఆధికారులు ఆకుల బాలక్రిష్ణ,భారతి, ఉద్యాన అధికారులు రమణ, సూర్యనారాయణ,అశ్వారావుపేట,అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు నాగబాబు,కళ్యాన్ గౌడ్ లు ఉన్నారు.
Spread the love