అర్థ జీవితాలు!

అర్థ జీవితాలు!ఎంతో వెలుగుల భవితవ్యాన్ని చూడాల్సిన విద్యా ర్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోవడం అ త్యంత బాధాకరం. నయా ఉదారవాద ఆర్థిక విధానా లు ప్రభుత్వ విద్యకు గండి కొట్టి, కార్పొరేటుకు పట్టం కట్టి, సమిష్టి భావన స్థానే వ్యక్తివాదానికి పాదులు తీసి న పరిణామాల అన్నింటి పర్యవసానమే ఇది. నాలుగు రోజుల కిందట బెంగళూరులో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దానికి కొద్ది రోజుల ముందు ఢిల్లీలో ఐఐటి విద్యార్థి రైలు కిందపడి, ప్రాణాలు తీసుకున్నాడు. నీట్‌, ఐఐటి వంటి కోర్సుల్లో సీట్ల కోసం శిక్షణ ఇచ్చే రాజస్థాన్‌ లోని కోటా కోచింగ్‌ సెంటర్లలో ఆత్మహత్యలు పరిపాటి అయ్యాయి. ఒక్క 2023లోనే అక్కడ 26మంది విద్యా ర్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. జాతీయ నేర గ ణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం.. 2022లో దేశం మొత్తమ్మీద 13,044 మంది విద్యా ర్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ చదువుల పర్వాన్ని సాగించాల్సిన తరుణం నే టితరం విద్యార్థులకు ఎందుకని చీకటి కుహరంగా మా రుతుంది? ఇరవై ఏండ్ల క్రితం ఇంతగా లేని ఆత్మహ త్యలు ఇప్పుడెందుకు ఏడాదికి వెయ్యికి పైబడి చోటు చేసుకుంటున్నాయి? దేశంలో వేళ్లూనుకున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాయి. సమాజ ఉత్థాన పతనాలను, చరిత్ర ఆటుపోట్లను వివరించి, ఆత్మస్థైరాన్ని పెంచే సా మాజిక శాస్త్రాల బోధన అవసరమే లేదని తేల్చి పడే శాయి! తీవ్రమైన పోటీ, ఒత్తిడి గొప్ప ఫలితాలను ఇస్తా యన్న యాంత్రిక ధోరణిని విద్యార్థులపై మోపాయి. దీనికితోడు సందట్లో సడేమియాలా జొరబడుతున్న విద్య కాషాయీకరణ విద్యార్థుల్లో ప్రశ్నించే స్వభావాన్ని నిర్వీర్యం చేస్తోంది. నవోత్తేజంతో ఉరకలు వేయాల్సిన విద్యార్థిలోకం వీటన్నిటి మూలంగా నిస్తేజితమవుతోం ది. ఒత్తిడిని తట్టుకోలేని, వైఫల్యాన్ని అంగీకరించలేని నీరసగళంగా మారుతోంది. కోటాలో ఆత్మహత్యల నేప థ్యంలో నియమించిన భవానీసింగ్‌ దేథా కమిటీ కూడా అదే విషయాన్ని నొక్కి వక్కాణించింది.
సమాజంలో చదువులు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ – ఈ ఇరవై ఏండ్లలోనే ఇలాంటి విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని లోతుగా విశ్లేషిస్తే- విద్య, వైద్యం తదితర రంగాలకు నూతన ఆర్థిక విధానాలు చేసిన చేటు ఏమిటో అర్థమవుతుంది. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడం, కార్పొరేటు విద్యాసంస్థలు విచ్చల విడిగా విస్తరించే అవకాశాలు కల్పించటం, ప్ర యివేటు, కార్పొరేటు చదువులతోనే భవిష్యత్తు వెలిగి పోతుంది అన్న భావనను పెంపొందించటం గడిచిన మూడు దశాబ్దాల్లో విపరీతంగా జరిగిపోయింది. లక్షల రూపాయలు పోసి పిల్లలను చదివిస్తున్న సగటు మధ్య తరగతి కుటుంబాల ఆకాంక్షలు పిల్లల మీద క్షణ క్షణం ఒత్తిడిని రాజేస్తున్నాయి. దీనికితోడు అత్యధిక ప్రయి వేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో పిల్లలను నిరంతర ఒత్తిడితో నలిగేలా చేయడం తప్ప ఎక్కడా ఉత్తేజాన్నిచ్చే ఆటపాటల జాడలేదు. సాధించి తీరాలనే పోటీ ఉపదే శాలు తప్ప వినోద వికాసాలకు విలువ లేదు. మార్కు లూ ర్యాంకుల లెక్కలతోనే విద్యాసంస్థల మూల మూ లలూ పిక్కటిల్లుతున్నాయి. ఇలాంటి ఊపిరి సలపని పీడన వాతావరణంలో నిర్దేశిత లక్ష్యాలను చేరలేదనో, చేరలేమనో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. బతకటా నికి అనేక దారులు, అవకాశాలూ ఉన్నాయన్న భరోసా, సాంత్వన వారికి లభించకుండా పోతోంది.
ఈ అసహజ, అమానవీయ చదువుల చిత్రాన్ని సమర్పించిన ఉదారవాద ఆర్థిక విధానాల చట్రాన్ని బద్దలు కొట్టాలి. అప్పుడే ఊపిరి సలపని చదువుల నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశ మనం లభిస్తుంది. దీనికోసం విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి, యువ జన సంఘాలూ, మేధావులూ పూనుకో వాలి. ప్రభుత్వాలు తక్షణం స్పందించి, ఇప్పటి వరకూ వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను అమలు చేయాలి. ఆటలూ పాటలతో కూడిన చదువు, తలకు, తనకూ బరువు కాని చదువూ విద్యార్థికి అందిం చాలి. పిల్లల శక్తిని, ఆసక్తిని అంచనా వేసి, తదనుగుణమైన విద్యనే అందించటానికి తల్లిదండ్రుల వైపు నుంచీ ప్రయత్నం జర గాలి. గొప్ప గొప్ప చదువులు, స్థానాలూ, సాధనలూ అవసరమైనవే! కానీ, జీవితం వాటన్నిటికన్నా ముఖ్యమైనది. అందుకనే మన విద్యావ్యవస్థను ఆమూలాగ్రం పునర్ని ర్మించుకోవాలి. చావులూ, సంక్షోభాలూ లేని చదువులు నాగరిక, మానవీయ సమా జానికి నాందీవాచకాలు.

Spread the love