Thursday, May 7, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇటిక్యాలలో మెగా పశువైద్య శిబిరం

ఇటిక్యాలలో మెగా పశువైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక”కార్యక్రమంలో భాగంగా నేడు మండలస్థాయిలో ఎంపిక చేసిన ఇటిక్యాల గ్రామంలో పశువైద్య ఆరోగ్య,పశు సంపద సంతానోత్పత్తి మెగా శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ తెలిపారు.ఉదయం 7 గంటల నుండి జరిగే ఈ శిబిరంలో పశువుల ఆరోగ్య పరీక్షలు,అనారోగ్య పశువులకు చికిత్స,కృత్రిమ గర్భధారణ,గర్భధారణ పరీక్షలు, సంతానోత్పత్తి చికిత్సలు,మేలు జాతి తో దూడల ప్రదర్శన,సబ్సిడీ గడ్డి విత్తనాల పంపిణీ,సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఆడ దూడల ప్రోత్సాహం, పశుగ్రాసాల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు.మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు,పశుపోషకులు హాజరై కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -