కొత్త హెక్టార్ వేరియంట్లు షైన్ ప్రో సెలక్ట్ ప్రోలను ప్రవేశపెట్టిన ఎంజి మోటార్ ఇండియా

– హెక్టార్ ఇప్పుడు రూ.13.99 లక్షల దగ్గరల ప్రారంభమవుతుంది
– భారతదేశపు అతి పెద్ద 35.56 cm (14-అంగుళాల) హెచ్‌డి పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తోంది.
– సెలక్ట్ ప్రో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తోంది షైన్ ప్రో. 
– కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో + యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 17.78 సెం.మీ ఎంబెడెడ్ ఎల్ఇడి స్క్రీన్‌తో కూడిన పూర్తి డిజిటల్ క్లస్టర్‌తో సహా కొత్త ఫీచర్లతో వస్తున్నాయి
–  స్మార్ట్ ఎంట్రీతో కూడిన పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఇడి-కనెక్ట్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్ తో సహా మరెన్నో.
నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశపు మొట్టమొదటి ఇంటర్‌నెట్ ఎస్‌యువి- ఎంజి హెక్టార్‌లో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేస్తున్నట్టు ఎంజి మోటార్ ఇండియా ప్రకటించింది. షైన్ ప్రో, సెలక్ట్ ప్రో అనే పేర్లు కలిగిన ఈ కొత్త వేరియంట్లు భద్రత మరియు డ్రైవింగ్ సౌలభ్యంతో పాటు అనేక సరికొత్త ఫీచర్లను, సర్వోత్కృష్టమైన సాంకేతికతను కలిగి ఉన్నాయి. చూడగానే ఆకర్షించే బయట, లోపలి భాగాలను ఈ విభాగంలో అత్యుత్తమమైన విశిష్టతలు, విలక్షణమైన డిజైన్ అంశాలతో ప్రామాణికీకరించడం జరిగింది. ఎంజి హెక్టార్ ఇప్పుడు రూ. 13.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ఆకర్షణీయమైన ధరతో ప్రారంభమవుతుంది. తన డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి ఈ తరగదిలోను అత్యుత్తమమైన అంశాలను కలిగి ఉన్న ఎంజి హెక్టార్ తమ వాహనాలలో సాంకేతికతను, అత్యుత్తమ పనితీరును ఇష్టపడే ఎస్‌యువి భావి కొనుగోలుదారులకు గొప్ప విలువైన ఆవిష్కరణ. కొత్త వేరియంట్లు షైన్ ప్రో, సెలక్ట్ ప్రో రెండూ భారతదేశపు అతిపెద్ద 14-అంగుళాల హెచ్‌డి పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రెండూ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో కలిసి అత్యుత్తమ ఇన్-కార్ ఇన్ఫోటైన్‌మెంట్ అనుభవాన్ని అందిస్తాయి. హెక్టార్ కొత్త వేరియంట్లు ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్‌లు, ఎల్ఇడి బ్లేడ్ అనుసంధానమైన టెయిల్ ల్యాంప్స్ మరియు క్రోమ్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. కూర్చోవడానికి మొత్తం బ్లాక్ థీమిన్ సీట్లు, లెదర్ చుట్టిన స్టీరింగ్, మెంటల్ ఫినిష్ (సివిటి 5 సీటర్)తో సెలక్ట్ ప్రో వెరియంట్లు రెండూ ఒక పూర్తి డిజిటల్ క్లస్టర్‌లో ఉన్న 17.78 సెంటీమీటర్ల ఎల్ఇడి స్క్రీన్‌తో లభ్యమవుతాయి. సౌకర్యం, సౌలభ్యం విషయాలకి వస్తే, షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రోలు ఒక పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్‌ స్మార్ట్ కీని కలిగి ఉన్నాయి. కొత్త వేరియంట్లు ఈ  విభాగంలో మొదటిసారిగా డిజిటల్ బ్లూటూత్ ® కీ మరియు కీ షేరింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి.
“ 2019లో ప్రారంభమైన నాటి నుంచి తన సాధికారమైన ఉనికితో, ఎంజి హెక్టార్ ఒక ఘనమైన ప్రకటన చేసింది, బహుళమాన సాంకేతిక ఫీచర్లతో, అత్యున్నతమైన డ్రైవింగ్ సౌలభ్యంతో ఎడిఎఎస్ లెవెల్ 2 మరియు అనుసంధానమైన ఫీచర్లతో ఎస్‌యువి రంగాన్ని పునర్నిర్వచించింది. తదుపరి ప్రతి వేరియంట్ సౌలభ్యం, అధనాతన సాంకేతికత, ఎకనామిక్ డిజైన్‌ల సామరస్యమైన సమ్మేళనాన్ని అందించడం ద్వారా ఈ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మీ మార్కెట్ పరిశోధన, పారిశ్రామిక విశ్లేషణ, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌లలోని లోతైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రెండు సరికొత్త వేరియంట్లను మేము ప్రవేశపెట్టడం అనేది అత్యున్నతమైన డ్రైవింగ్ అనుభవాన్ని, పనితీరును, పవర్‌ను అందించడానికీ, తద్వారా ఎస్‌యువిలను కోరుకొనేవారికి సేవలు అందించడానికీ మాకున్న అంకితభావాన్ని ఇది చాటి చెబుతోంది” అని ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా తెలిపారు. క్రూయిజ్ కంట్రోల్*, పార్కింగ్ బ్రేక్ *, మొత్తం నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్), హిల్ హోల్డ్ కంట్రోల్ (హెచ్ఎసి), ఎబిఎస్ + ఇబిడి, బ్రేక్ అసిస్ట్, అన్ని సీట్లకూ సీట్ బెల్ట్ రిమైండర్, ఫాలోమీ హోమ్ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ముందు & వెనుకా డీఫాగర్,  వేగాన్ని పసిగట్టే ఆటో డోర్‌ లాక్, ఆసోఫిక్స్ ఛైల్డ్ సీట్ యాంకర్స్, అత్యధిక వేగంపై అప్రమత్తం చేసే హెచ్చరిక లాంటి కీలకమైన సౌలభ్యాన్నీ మరియు భద్రతా ఫీచర్లను కూడా హెక్టార్ కొత్త ఫీచర్లు అందిస్తున్నాయి. దీనికి అదనంగా, సెలెక్ట్ ప్రో 18” డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందిస్తోంది, కాగా షైన్ ప్రోలో 17” సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. షైన్ ప్రోను రూ. 15,99,800 వద్ద, సెలెక్ట్ ప్రోను రూ. 17,29800 వద్ద (ఎక్స్-షోరూమ్) ఎంజి ప్రవేశపెట్టింది. విక్రయానంతర సేవ ఎంపికలతో విశిష్టమైన కారు యాజమాన్య కార్యక్రమం “ఎంజి షీల్డ్”ను హెక్టార్ వారి షైన్ ప్రో సెలక్ట్ ప్రో వేరియంట్లు అందిస్తున్నాయి. అలాగే, వినియోగదారులకు ఒక ప్రామాణికమైన 3+3+3 ప్యాకేజిని అంటే అపరిమితమైన కిలోమీటర్లతో మూడేళ్ళ వారెంటీనీ, మూడేళ్ళ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ను, మూడు లేబర్-ఫ్రీ పీరియాడిక్ సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అదనంగా, హెక్టార్ యజమానులు తమ వారంటీని లేదా ఆర్ఎస్ఎని పొడిగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎంపికలను పొందవచ్చు లేదా కెంపెనీవారి ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్యాకేజీలైన ప్రొటెక్ట్ ప్లాన్లను తమ మనశ్శాంతి కోసం, వత్తిడి లేని యాజమాన్య నుభవం కోసం ఎంచుకోవచ్చు.

Spread the love