వేములవాడలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన ర్యాలీ..

Protest rally of lunch workers in Vemulawada..– రేపు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెలుతున్నట్లు ప్రకటన..
– భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీసం లక్ష్మణ్ డిమాండ్..
నవతెలంగాణ – వేములవాడ
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కాంగ్రెస్ రాష్ట్ర  ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి మండల విద్యాధికారి కార్యాలయం వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా వున్నాయని సరిపడా జీతాలు లేకపోవడంతో పూట గడవని పరిస్థితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తమ సమస్యలపై (రేపు) నేడు హైదరాబాద్ లో తల పెట్టిన ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తున్నామని పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయడం వీలు కాదని వినతి పత్రంలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో లో  పెట్టిన పదివేల వేతనాన్ని చెల్లించాలని, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంట కార్మికులను తొలగించకుండా జీవో తీసుకురావాలని పేర్కొన్నారు, రాగి జావా అల్పాహారం  వేతనాలు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love