Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాల బిల్లులు రూ.1 కోటి బకాయిలు

పాల బిల్లులు రూ.1 కోటి బకాయిలు

- Advertisement -

  పాడి రైతుల ఎదురుచూపులు 
నవతెలంగాణ-అచ్చంపేట
పాలశీతలీకరణ కేంద్రం అచ్చంపేట పరిధిలో గల పాడి రైతులు పాల బిల్లులు రూ. 1కోటి బకాయిలు ఉన్నాయి. బిల్లుల కోసం పాడి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.15 రోజులకు ఒక సారి  బిల్లులు చెల్లించవలసి ఉండగా 45 రోజులు గడిచినప్పటికీ బిల్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ గ్రామాలలోని 680 మంది పాడి రైతులు  ప్రతిరోజు 6500 లీటర్లు పాలను పట్టణంలోని పాలశీతలికరణ  కేంద్రానికి పోస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి పాల బిల్లులు ఇవ్వాలని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై పాల శీతలీ కరణ  కేంద్రం మేనేజర్ యాకన్న ను నవతెలంగాణ వివరణ కోరగా.. కోటి రూపాయలు బకాయిలు ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. అదేవిధంగా ఒక బిల్లు నేడు రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -