సీనియర్ జర్నలిస్టును పరామర్శించిన మిల్కూరి వాసుదేవరెడ్డి

Milkuri Vasudeva Reddy who visited the senior journalist

నవతెలంగాణ – శంకరపట్నం
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మిలకూరు వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ,సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి ఎడమ కాలు చీలమండలం విరగడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్సా చేయించిన అనంతరం ఆయన స్వగ్రామమైన తాడికల్ కు తీసుకువచ్చారు.ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న   మిలకూరు వాసుదేవరెడ్డి,శనివారం వెంకటస్వామి నీ పరామర్శించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల హెల్త్ కార్డులు సక్రమంగా పని చేయడం లేదని,నివేశన స్థలాలు ఇండ్లు మంజూరు గత ప్రభుత్వం చేయలేదని, పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.వెంకటస్వామి తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు వెలమ రెడ్డి రాజిరెడ్డి,మైధం శెట్టి యుగేందర్,జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎలుకపల్లి శ్రీనివాస్,పాల్గొన్నారు.

Spread the love