సీఎంఆర్‌ రైస్‌ను అందించడంలో డిఫాల్ట్‌ అయిన మిల్లర్లు ఏప్రిల్‌ లోపు అందించాలి

– జిల్లా అదనపు కలెక్టర్‌ జి.లింగ్యా నాయక్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
2021-22 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్‌ రైసును అందించడంలో డిఫాల్ట్‌ అయిన మిల్లర్లు ఏప్రిల్‌ మాసం లోపు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగా నాయక్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లర్లతో అదనపు కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్‌ రైసును గడువులోగా పౌరసరఫరాల సంస్థకు అందించని నేపథ్యంలో జిల్లాలో కొందరు రైసుమిల్లర్లను డిఫాల్టర్లుగా ఉండిపోయారన్నారు. ఇలాంటి రైస్‌ మిల్లర్లు సమయాన్ని విధిస్తూ పెండింగ్‌ సీఎంఆర్‌ రైస్‌ ను ఏప్రిల్‌ మాసాంతపులోపు పౌరసరఫరాల సంస్థకు వంద శాతం చేరవేసేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్‌, పౌరసరఫరా ల జిల్లా మేనేజర్‌ సుగుణబాయి, రైస్‌ మిల్లర్ల జిల్లా అధ్యక్షుడు బాలేష్‌ గుప్తా, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారులు, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

Spread the love