నవతెలంగాణ – జక్రాన్ పల్లి : గ్రామీణ ఉపాధి హామీ కూలీల రోజు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి ₹200 రోజులు పని కనిపించాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మే 29 తేదీన జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ మహాసభల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా, నిధులను కుధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసి, చివరికి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. రైతే రాజు అంటూ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తుందని ఆయన తెలిపారు.
స్వామినాథన్ కమిషన్ ప్రకారం సి2+50 శాతం మద్దతు ధర కట్టించి, రైతాంగానికి అండగానిర్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని, రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా చేయాలని, రైతు భరోసా సకాలంలో వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నాయకులు సాయన్న మాట్లాడుతూ 04 జూన్2026న ధర్పల్లి లో జరిగే డివిజన్ మహాసభను జయప్రదం చేయాలని రైతు కూలీలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు గోవింద్ పెట్ సాయన్న, అనంతయ్య, నరేందర్, స్థానిక నాయకులు గౌతమ్, రెడ్డి, కమ్మరి నర్సయ్య, ఐఎఫ్టియు నాయకులు భానుచందర్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



