అమ్మాయిలను ప్రోత్సహించిన సినిమాటోగ్రఫీ  నైపుణ్యాలు: మంత్రి కోమటిరెడ్డి

– దేశంలోనే ప్రధమంగా నిలిచిన కార్యక్రమం
– తమ అనుభవాలను పంచుకున్న విద్యార్థులు
– కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం
– అభివృద్ధి చెందిన దేశాలు నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తాయి
– అవి జీవితంలో విజయాన్ని, స్థిరపడే గమ్యాన్ని ఇస్తాయి 
– త్వరలో 90 కోట్లుతో సాంస్కృతిక కేంద్రం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ  సాంఘిక సంక్షేమ  రెసిడెన్షియల్ కళాశాల, చర్లపల్లిలోని ఎస్సీ, ఎస్టీ విభాగానికి చెందిన 100 మంది అమ్మాయిలకు సినిమాటోగ్రఫీ నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించిన నిలగిరి నిపుణా ప్రోగ్రాం సర్టిఫికెట్ పంపిణీ శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాల ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ  కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిదిగా, 100 మంది అమ్మాయిలను సినిమాటోగ్రఫీ సంబంధిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రోత్సహించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రారంభమై ఏప్రిల్ 2024 వరకు సాగిన  45 రోజుల కోర్సు థియరీ, ప్రాక్టికల్ శిక్షణ రెండు అందించడం జరిగింది. సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమంలో  రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, జిల్లా ఎస్పీ దీప్తి చందన, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, స్పేస్ అకాడమీ చైర్మన్ శశి ప్రీతం, నటుడు వైభవ్ సూర్య, ఇతర ప్రముఖులు,  సాంఘికసంక్షేమ, గిరిజన సంక్షేమ విభాగాల అధికారులు, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాళ్లు, మేనేజ్‌మెంట్, విద్యార్థులు, మహిళా సమాఖ్య గ్రూపులు, గ్రామీణ అభివృద్ధి నైపుణ్య శిక్షణ కేంద్రం విద్యార్థులు  100 మంది అమ్మాయిల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డబ్బింగ్, యాంకరింగ్ విద్యార్థులు జయశ్రీ, శ్రుతి చక్కగా నిర్వహించగా, సినిమాటోగ్రఫీ విద్యార్థులు శ్రుతి, ఆమె బృందం కెమెరా కవరేజీ నిర్వహించారు. రుద్రవరం పల్లవి, ప్రణతి, ఇతర విద్యార్థులు  అతిథుల ముందు తమ  అనుభవాలను గురించి మాట్లాడారు.
సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, యువత అమ్మాయిల విద్యకు తన ఆసక్తిని తెలియజేశారు. ఇటీవల ఐటి మంత్రి శ్రీధర్ తో కలిసి అమెరికా పర్యటనలో, అభివృద్ధి చెందిన దేశాలు నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాయని, ఇది జీవితంలో విజయం, స్థిరపడే గమ్యంగా ఉన్నదని ఆయన అన్నారు. సినిమాటోగ్రఫీ వంటి నైపుణ్యాలను నేర్చుకోవడానికి  మరింత మందివిద్యార్థులను ప్రోత్సహించడానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ  నల్గొండ చుట్టూ ప్రత్యేకంగా 15 కిమీ రింగ్ రోడ్, క్లాక్ టవర్ సర్కిల్ వద్ద రూ. 90 కోట్లు ఖర్చుతో సాంస్కృతిక కేంద్రం వంటి ప్రాజెక్టులు త్వరలో రాబోతున్నాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ హరి చందన  మాట్లాడుతూ ,  మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి   జిల్లా నైపుణ్య అభివృద్ధి కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆయన సినిమాటోగ్రఫీ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నందున, ఈ నైపుణ్యాలను ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలకు నేర్పడానికి ఈ కార్యక్రమం వెంటనే చేపట్టబడిందని ఆమె తెలిపారు. స్పేస్ అకాడమీ చైర్మన్ శశి ప్రీతం మాట్లాడుతూ, మంత్రి, కలెక్టర్ నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులను మార్గనిర్దేశనం చేయడం, నైపుణ్యాలలో నిపుణులుగా తీర్చడం అనేది బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే, శిక్షణా కాలంలో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌లు, అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, కెరీర్ కౌన్సెలింగ్‌లతో సహకరించడానికి సపోర్ట్ చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆవనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ రాజ్య లక్ష్మీ, డిఆర్డిఏ పిడి  నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఆర్టీవో రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love