త్వరలో ఆరులైన్ల రోడ్లకు టెండర్లు: మంత్రి కోమటి రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ల రోడ్‌కు త్వరలోనే టెండర్లు పిలిచి, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇతర కారిడార్లపైనా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. తమ విన్నపాలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు.

Spread the love