Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దొనకొండ రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెయిన్ రోడ్డుపై బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు.అనంతరం కాంగ్రెస్ యువ నాయకుడు దొనకొండ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బట్టర్ మిల్క్,అరటిపండ్లు పంపిణీ చేశారు.మంత్రి కోమటిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాచేపల్లి సతీష్,పూసపెల్లి దీపక్, చెర్విరాల రాములు,బొబ్బిలి లింగరాజు, నకిరేకంటి అయోధ్య,కాసర్ల చంద్రు,కాసర్ల రాములు,సంతోష్,వర్ధెల్లి రాము, పేర్ల నరేష్,వర్ధెల్లి గణేష్,పచ్చిపాల వినయ్,మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -