
హుస్నాబాద్ పట్టణంలోని సమ్మక్క సారలమ్మలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు.అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని,రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి , చిత్తారి రవీందర్ పద్మ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.