ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడవుతున్న మంత్రి శ్రీధర్ బాబు

– అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు  భరోసా
– రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని పల్లెల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆరోగ్యంగా ఆదుకోవడానికి, ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆపద్బాంధవుదవుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయుతనిస్తూ, ఆర్థికంగా అదుకుంటున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఆన్ సాన్ పల్లి  గ్రామానికి చెందిన జాటోతు సమ్మయ్య అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు బాధితుని కుటుంబ సభ్యులు ఇటీవల విన్నవించారు. ఇందుకు మంత్రి స్పందించి రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. శనివారం మంత్రి సహాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రి దుద్దిళ్లకు బాధితుని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love