అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.

Spread the love