మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

– బాధిత కుటుంబానికి చేయూత
నవతెలంగాణ-మల్హర్ రావు : ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి అన్ని తానై వైద్యులచే  మెరుగైన వైద్యం అందించేలా కృషి చేసిన రాష్ట్ర ఐటి పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరబాద్ లోని  నిమ్స్ హాస్పిటల్  లో మంథని మండలంలోని గుంజపడుగు గ్రామనికి చెందిన గుర్రం సతీష్  ప్రమాదవశాత్తు ట్రాక్టర్ మీద నుండి పడిపోగా కుటుంబ సభ్యులు శ్రీధర్ బాబు  తెలియజేయగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేయించి వైద్యులచే మెరుగైన వైద్యం అందించేలా కృషిచేసిన దుద్దిళ్లకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సతీష్  హాస్పిటల్ నుండి క్షేమంగా డిశ్చార్జ్  కాగా అంబులెన్స్ ఏర్పాటు చేసి క్షేమంగా ఇంటికి చేరేలా చేసినట్లుగా తెలిపారు.
Spread the love