ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

నవతెలంగాణ -హైదరాబాద్: ధాన్యం కొనుగొళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని.. గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 6919 కేంద్రాల్లో ధాన్యం కొనుగొలు జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నాటికి కేవలం 339 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని.. గతేడాది ఏప్రిల్ 15 నాటికి సిద్దిపేట జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం తెరలేదన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం సిద్దిపేట జిల్లాలో ఇవాళ్టికి 418 కొనుగోలు కేంద్రాలు నడుతుస్తున్నాయని వివరించారు.  ధాన్యం ఎక్కువ చోట అదనపు కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.

Spread the love