రైతుబంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

నవతెలంగాణ – హైదరాబాద్: రైతుబంధు (రైతుభరోసా) ఆర్థిక సాయం పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నగదు సీజన్ కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరలో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందని భావిస్తోందట. అది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love