కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.

Spread the love